ఇటీవల మార్కెట్ లోకి విడుదల అయిన బండి మాత్రం కవాసాకి వల్కాన్ ఎస్. బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసిన ఈ మోటార్ సైకిల్ ఆకట్టుకుంటోంది.. ఎంత సరి కొత్త ఆఫర్లు ఉన్నాయో అంతకు మించి రేటు కూడా ఉంది.. రూ.5.79 లక్షలుగా సంస్థ నిర్దేశించింది.బీఎస్4 మోడల్ తో పోలిస్తే ఈ సరికొత్త 2021 కవాసాకి వల్కాన్ ఎస్ మోటార్ సైకిల్ ధర దాదాపు 30 వేల రూపాయల అధికంగా ఉంది. లాంగ్ డ్రైవ్ కు వెళ్ళాలనుకుంటే ఈ బైక్ ఉండాల్సిందే అంటూ బైక్ ప్రేమికులు అంటున్నారు..