ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ కార్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు..బెంజ్ కారు అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. రిచ్ కార్లలో ఒకటి.. ఈ కంపెనీ ఇప్పటికే ఎన్నో కార్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. వాటికి మంచి డిమాండ్ కూడా ఏర్పడింది. కాగా, ఈ తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ బుధవారం తన ఎస్యూవీ విభాగంలో 2021 జీఎల్సీ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.57.40 లక్షలుగా ఉండే ఈ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. జీఎల్సీ 200 పెట్రోల్ వేరియంట్ ధర రూ.57.40 లక్షలుండగా, జీఎల్సీ 200డి డీజిల్ వేరియంట్ ధర రూ. 63.15 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.