ఆటో మొబైల్ కంపెనీలలో మారుతి కంపెనీ ఒకటి... అప్పటి కాలం నుంచి ఈ కార్లు మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి. ప్రజల మెప్పును కూడా పొందాయి.. కరోనా వల్ల ప్రపంచం చిన్నా భిన్నం అయ్యింది.. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ కంపెనీ కొత్త కార్లను మార్కెట్ విడుదల చేసి మంచి లాభాలను పొందింది. ఆ కారెంటో , ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మారుతీ సుజుకీ క్యూ3లో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 24.1శాతం వృద్ధితో రూ.1941.4 కోట్లకు ఎగబాకింది.