గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను ప్రైమరీ సిస్టంగా లక్షలాది ఫోర్డ్ కార్ల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ పై ప్రవేశపెట్టనుంది. ఈమేరకు గూగుల్ తో ఫోర్డ్ కంపెనీ ఆరు సంవత్సరాల వ్యూహాత్మక ఒప్పందం చేసుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ సరికొత్త ఫోర్డ్, లింకన్ కార్స్ 2023 నుంచి రోడ్లపై పరుగులు తీయనున్నాయి. ఆండ్రాయిడ్ సిస్టం తో ఈ కార్లు నడవనున్నాయి. వీటిలో గూగుల్ నావిగేషన్ సిస్టంను గూగుల్ వాయిస్ అసిస్టెన్స్ ద్వారా అందుబాటులోకి రానుంది.ఆండ్రాయిడ్ ఫోన్ లేకుండానే వాయిస్ కమాండ్స్ తో ఇది పనిచేసేలా అడ్వాన్స్ వర్షన్ ఆకట్టుకునే ఫీచర్ ఉంటుందని సమాచారం.