ప్రస్తుతం మార్కెట్లో డీజిల్‌తో నడిచే ట్రాక్టర్లే ఉన్నాయి. పెరుగుతున్న ధరలతో రైతులపై అదనపు భారం పడుతోంది. ఈ క్రమంలోనే రైతుల ఖర్చును తగ్గించే సరికొత్త ట్రాక్టర్ వచ్చేసింది. తొలి సీఎన్జీ ట్రాక్టర్‌ను కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ఆవిష్కరించారు. రామట్ టెక్నో సొల్యూషన్స్, టొమాసెటో అచిల్లీ ఇండియా సంస్థలు సంయుక్తంగా ఈ ట్రాక్టర్‌ను రూపొందించాయి.ఈ ట్రాక్టర్‌తో ప్రధానంగా మూడు లాభాలున్నాయి. దీనికి డీజిల్‌తో నడిచే ట్రాక్టర్‌తో సమానంగా లేదా అంత కంటే ఎక్కువ సామర్థ్యం ఉంటుంది. డీజిల్ ఇంజిన్‌తో పోల్చితే 70 శాతం తక్కువ ఉద్గారాలు విడుదలవుతాయి.