కొత్తగా కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం అదిరిపోయే ఆప్షన్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రముఖ దేశీ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ కొనుగోలుదారులకు తక్కువ ఈఎంఐతోనే కొత్త కారు ఇంటికి తీసుకెళ్లే ఛాన్స్ కల్పిస్తోంది. టాటా మోటార్స్ వెబ్సైట్ ప్రకారం.. టాటా టియాగో కారును నెలకు కేవలం రూ.3,555 ఈఎంఐతో ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఈ కారు ధర రూ.4.85 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. ఈ రెండు వివరాలను మాత్రమే కంపెనీ తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.