కొత్త లుక్లో టాటా సఫారీ ఇండియన్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. సోమవారం ఉదయం 11 గంటలకు సఫారీని లాంచ్ చేస్తున్నట్లు టాటా సంస్థ ప్రకటించింది. గత నెలలో ఈ వెహికిల్ను ఆవిష్కరించిన సంస్థ.. ఈ నెల ప్రారంభం నుంచి రూ.30 వేలకు బుకింగ్స్ కూడా తీసుకుంటోంది. వెహికిల్ను లాంచ్ చేసిన వెంటనే దీని ధరను కూడా ప్రకటించనున్నారు. ఈ ఎస్యూవీ ధర ఎంత అన్నదానిపై కంపెనీ ఇప్పటి వరకూ ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే దీని ప్రారంభ ధరనే రూ.18 లక్షలు గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.