తాజాగా KM3000, KM4000 రెండు కొత్త హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ లను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది.. నేటి నుంచి బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.. డెలివరీ లు మాత్రం మే నెల నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది..ఎకో, బూస్ట్ అనే రెండు మోడ్స్ లో ఛార్జింగ్ చేయవచ్చు. ఎకో మోడ్ లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6 గంటల సమయం పడుతుంది. బూస్ట్ మోడ్ లో 80 శాతం బ్యాటరీ ని కేవలం 5 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. ఈ రెండు బైక్స్ లో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్, ఆన్ బోర్డ్, రోడ్ సైడ్ అసిస్టెంట్, పార్క్ అసిస్ట్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. ఇకపోతే ఒకసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ స్పీడ్ తో 150 కిలో మీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు..