యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్న వాటిలో చాలా రకాల బైకులు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. ఇప్పుడు కొత్త ఫీచర్స్ తో మరో కొత్త బైక్ ను మార్కెట్ లోకి వదిలారు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..అత్యుత్తమ మోటార్ సైకిళ్లు విడుదల చేస్తోన్న సంస్థ జావా. తాజాగా ఈ ఐరోపా కంపెనీ సరికొత్త 2021 టూవీలర్ ను భారత విపణిలో లాంచే చేసింది. అదే జావా ఫార్టీ టూ మోటార్ సైకిల్. దిల్లీ ఎక్స్ షోరూంలో ఈ 2021 జావా మోటార్ సైకిల్ ప్రారంభ ధర వచ్చేసి రూ.1.84 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. అత్యాధునిక ఫీచర్లు, ప్రత్యేకతలతో అందుబాటులోకి వచ్చిని ఈ బైక్ ఆకట్టుకుంటోంది.