డ్రాగన్ కంటే చౌకగా కార్లను ఉత్పత్తి చేసేందుకు గ్లోబల్ ఎలక్ట్రిక్ కారు దిగ్గజం టెస్లాకు రాయితీలు కల్పించేందుకు తాము సిద్ధం అని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. భారత్లో కార్ల తయారీకి టెస్లా సిద్ధమైతే.. అవసరమైన అన్ని రకాల రాయితీలు కల్పిస్తామని చెప్పారు. బెంగళూరులో టెస్లా కంపెనీ పేరును ఆ సంస్థ సీఈవో ఎలన్ మస్క్ నమోదు చేసిన కొన్ని వారాలకు నితిన్ గడ్కరీ పై వ్యాఖ్యలు చేశారు.విదేశాల నుంచి విడి భాగాలను దిగుమతి చేసుకుని ఇక్కడే స్థానిక కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని తయారు చేస్తే బాగుంటుంది.. అని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.