బెంగళూరుకు చెందిన స్టార్టప్ లాగ్ 9 మెటీరియల్స్.. ఓ ర్యాపిడ్ చార్జింగ్ బ్యాటరీని ఆవిష్కరించింది. ద్విచక్ర, త్రిచక్ర విద్యుత్ ఆధారిత వాహనాల కోసం రూపొందించిన ఈ బ్యాటరీ.. కేవలం 15 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ కావడం విశేషం. ఈ బ్యాటరీ 15 ఏండ్లకుపైగా పనిచేస్తుందని, కాబట్టి తక్కువ ఖర్చుతోనే ఎక్కువ మైలేజీని వినియోగదారులు సొంతం చేసుకోవచ్చని మంగళవారం సంస్థ తెలియజేసింది. అంతేగాక ప్రస్తుతం ఎంతో ఆదరణ ఉన్న లిథియం-ఐయాన్ బ్యాటరీలతో పోల్చితే తమ బ్యాటరీలు ఐదు రెట్లు అధిక శక్తిని కలిగి ఉంటాయని, అగ్ని ప్రమాదాలకున్న చాలా రేర్ అని సంస్థ వెల్లడించింది..