ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో నూతన మోడల్ టైర్లు లేని ట్రాక్టర్ అందరికీ ఆకట్టుకుంటుంది. ఖమ్మం వైపు నుంచి హైదరాబాద్ వేళ్లే రహదారిపై మంగళవారం సాయంత్రం ఒక వ్యక్తి ఈ ట్రాక్టర్‌ను నడుపుకుంటూ తీసుకెళ్లారు. దీనికి టైర్లు లేకుండా ఎండ్ల బండి లాంటి చక్రాలు ఉండటంతో గ్రామస్తులు దీనిని చూసేందుకు ఎగబడ్డారు. ఇప్పటివరకు ఇలాంటి చక్రాలు ఉన్న ట్రాక్టర్‌ను చూడలేదని, ఇదే మొదటిసారని అంటున్నారు. ఈ ట్రాక్టర్‌తో పత్తి, మిరప, మొక్కజొన్న చేలల్లో పాట్లు వేస్తే చెట్లు విరగకుండా ఉంటాయని యజమాని చెప్పాడు.