భారతీయ మార్కెట్ లో పొర్డ్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. సంవత్సరం పొడవునా కొత్త ఫీచర్లు ఉన్న కార్లను తయారు చేస్తున్నారు. అందరికీ అందుబాటు ధరలలో లభిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు మరో కొత్త వేరియంట్ తో కారును విడుదల చేయడానికి రెడీ అవుతుంది. ఎకోస్పోర్ట్ ఎస్యువి పేరుతో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఇదే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్ ఈ.. ఈ కొత్త వేరియంట్ కారు ధర పెట్రోల్ ఇంజిన్ అయితే రూ. 10.49 లక్షలు, అదే డీజిల్ ఇంజిన్‌తో రూ. 10.99 లక్షలకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. ఈ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్ ఈ ని ప్రస్తుతం అమెరికా, యురోపియన్ మార్కెట్లలో అమ్ముతున్నారు. వీటికి రేర్-మౌంటెడ్ స్పేర్ వీల్ రాదు.