సరికొత్త బీఎండబ్ల్యూ ఐ4 సెడాన్ ఫుల్లీ ఎలక్ట్రిక్ 4 డోర్ గ్రాన్ కూపేగా అందుబాటులోకి రానుంది. ఈ ఏడాదే మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు. బీఎండబ్ల్యూ ఐ4 సెడాన్ విభిన్న వర్షన్లలో విడుదల కానుంది. దీని రేంజ్ 590 కిలోమీటర్ల(WLTP) వరకు ఉంటుందని అంచనా, అయితే ఈపీఏ వర్షన్ అయితే 300 మైళ్ల(482 కిలోమీటర్ల) వరకు ఉంటుందని తెలుస్తోంది. దీని పవర్ ఔట్ పుట్ 390 కిలోవాట్లు లేదా 530 హార్స్ పవర్ ను కలిగి ఉంటుందని ఆ సంస్థ వెల్లడించింది.