హైదరాబాద్ లో వాహనాలకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. అలాగే వాటిని కొనుగోలు చేసేందుకు జనాలు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అంతే కాదు నగరంలో టూ వీలర్ వెహికిల్స్ కొనుగోలులో లీజింగ్‌కు భారీ ఆదరణ లభిస్తున్నదని ఫైనాన్స్ స్టార్టప్ ఓటీఓ టెక్నాలజీస్ తెలిపింది. వాహనాల లీజింగ్ కోసం తమ సంస్థలో రుణం తీసుకుంటున్న వారి సంఖ్య 386 శాతం వృద్ధి చెందిందన్నది. కొత్తగా మరో 45 వాహన డీలర్లు తమతో ఒప్పందం కుదుర్చుకున్నారని పేర్కొంది.