బజాజ్ నుండి అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న బైక్ పల్సర్. ఈమధ్యనే పల్సర్ 150 క్లాసిక్ మోడల్ బైక్ రిలీజ్ చేశారు. దేశీయ వాహన తయారీ సంస్థ అయిన బజాజ్ పల్సర్ ద్వారా తన మార్కెట్ ను విస్తరించింది. బజాజ్ నుండి వచ్చే పల్సర్ బ్రాండ్ రేంజ్ కూడా పెంచిందని చెప్పొచ్చు. ఇక బజాజ్ పల్సర్ 150 ఎవర్గ్రీన్ గా మారింది.


పల్సర్ 150 క్లాసిక్ ఈ ఇయర్ జూలైలో రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ క్లాసిక్ బైక్ నుండి సరికొత్త రంగులు రాబోతున్నాయి. ఇదవరకు బ్లాక్ కలర్ తో మాత్రమే అందుబాటులో ఉండే పల్సర్ 150 క్లాసిక్ ఇప్పుడు రెడ్, సిల్వర్ కలర్స్ తో వస్తుంది. బజాజ్ పల్సర్ బైకులలో యాంటీ లాక్ బ్రేక్ సిస్టెం అందుబాటులో ఉంది.


అయితే ఈ క్లాసిక్ వెహికల్స్ కు మాత్రం అది అందుబాటులో లేదని తెలుస్తుంది. అయితే కొత్త వెహికల్స్ లో ఏబిఎస్ ఫీచర్ మాత్రం అందుబాటులో ఉంది. ఇక ఈ బైక్ 150 సిసి కెపాసిటీతో ఫోర్ స్ట్రోక్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. 8000 ఆర్.పి.ఎం ఇంజిన్.. 14 బి.హెచ్.పి పవర్ ఇంకా 6000 ఆర్.పి.ఎం తో 13.4 ఎన్.ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: