అలోవేరా జెల్ లో విటమిన్ ఎ, సి తోపాటు యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి డ్రైస్కిన్, మొటిమల సమస్యతో బాధపడేవారికి ఉత్తమంగా సహాయం చేస్తాయి. విటమిన్ ఈ కాప్సూల్స్ చర్మాన్ని ఎండ ప్రభావం నుండి సంరక్షించడమే కాకుండా, చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచేలా చూస్తుంది. రోజ్ వాటర్ చర్మాన్ని ఆరోగ్యంగా చేయడమే కాకుండా, చర్మం మీద ఆయిల్ (జిడ్డు), మురికిని తొలగించి హైడ్రేట్ గా ఉంచి పిహెచ్ వాల్యూని పునరుద్దరిస్తుంది. ఇక గ్లిజరిన్ ముడతలు, ఫైన్ లైన్స్ తొలగించడంలో సహాయం చేస్తుంది.