కుంకుడు కాయల రసం నాచురల్ షాంపూగా పని చేస్తుంది. జుట్టుకి పోషణనిస్తుంది. దాంతో, జుట్టు మెరుస్తూ ఉంటుంది. జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది. కుంకుడుకాయల్లో ఉన్న విటమిన్స్ వల్ల జుట్టు డ్రై గా అవ్వకుండా ఉంటుంది. సిల్కీ, స్మూత్ హెయిర్ మీ సొంతమవుతుంది.స్కాల్ప్ మీద ఫంగస్ పెరగడం వల్ల చుండ్రు సమస్య వస్తుంది. కుంకుడు కాయలు స్కాల్ప్ ని పూర్తిగా శుభ్రపరుస్తాయి. దాంతో స్కాల్ప్ మీద ఫంగల్ గ్రోత్ ఉండదు. రెగ్యులర్గా కుంకుడుకాయలతోనే తలస్నానం చేస్తూ ఉండడం వల్ల చుండ్రు సమస్య పూర్తిగా పోతుంది.