ఒక టీస్పూన్ శనగపిండి తీసుకోండి. అందులో రెండు టీస్పూన్ల ఓట్ మీల్ పౌడర్ ను కలపండి. అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగును కలపండి. వీటిని బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకోండి. పదిహేను నిమిషాల తరువాత ఫేస్ వాష్ చేసుకోండి.