చలికాలం లో వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఉండే మజానే వేరు. కానీ, స్కిన్ కి మాత్రం అంత వేడి నీరు హాని చేస్తుంది. అందుకని గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయండి. అలాగే, స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఇందు వల్ల స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది.సమ్మర్ లో స్కిన్ కి సరిపోయే ప్రోడక్ట్స్ వింటర్ లో సరిపడవు. వింటర్ లో స్కిన్ హెల్దీగా గ్లోయీ గా ఉండాలంటే ఒకటే మార్గం, మైల్డ్ ప్రోడక్ట్స్ ని ఎంచుకోవడం. మాయిశ్చరైజర్స్ ఉన్న క్లెన్సర్స్ ని ఎంచుకోండి. ఆల్కహాల్ ఉన్న మాస్క్స్, పీల్స్, ఆస్ట్రిజెంట్ లోషన్స్, ఇంకా ఇతర స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ పూర్తిగా ఎవాయిడ్ చేయండి.