ఆయిలీ స్కిన్ అయితే మీరు అప్లై చేసుకున్నాక మీకు హెవీగా అనిపించకూడదు. అలాగే స్టికీగా కూడా ఉండదు. ఇన్గ్రీడియెంట్స్ లో ఆయిల్ లేని రిఫ్రెషింగ్, మరియు జెంటిల్ టోనర్ని సెలెక్ట్ చేసుకోండి. సెన్సిటివ్ స్కిన్ ఇన్గ్రీడియెంట్స్లో శాలీసిలిక్ ఆసిడ్ ఉన్న టోనర్ని చూజ్ చేసుకోవాలి. ఎస్ఎల్ఎస్, పారాబెన్స్ ఉన్న టోనర్స్ నుండి దూరంగా ఉండాలి. మీది యాక్నే ప్రోన్ స్కిన్ అయితే ఆల్కహాల్ లేని టోనర్ ని ఎంచుకోండి. అలాగే ఆల్ఫా హైడ్రాక్సీ ఆసిడ్ ఉన్న టోనర్స్ మృదువుగా ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. ఇందు వల్ల ఎలాంటి ఫ్లేకీనెస్ లేకుండా స్కిన్ గ్లోయీగా క్లీన్ గా ఉంటుంది. టోనర్ అప్లై చేసిన మొదటి రెండు, మూడు సెకన్లు కొద్దిగా టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుందంటే టోనర్లో పీహెచ్ లెవెల్ సరిగ్గా ఉందని అర్ధం, అంటే, కొద్దిగా ఎసిడిక్గా ఉందన్నమాట.