పొడిబారిన చర్మం కోసం... రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ తేనె, చిటికెడు పసుపు స్మూత్ గా కలపండి. ముఖానికీ, మెడకీ అప్లై చేసి పది నిమిషాల తరువాత కడిగేయండి.ఈ ప్యాక్ వల్ల చర్మం పొడిబారకుండా ఫ్రెష్ గా ఉంటుంది.