పంచదార బరువు పెరగడానికే కాదు, మొటిమలు రావడానికి కూడా కారణమౌతుంది. పంచదార ఎక్కువ తీసుకోవడం వల్ల స్కిన్ ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది, కొలాజెన్ ఫార్మ్ అవ్వకుండా ఆగిపోతుంది. దానివల్ల వచ్చే ఒక ఫలితం వయసు మీద పడినట్లుగా కనిపించడం. ఐస్ క్రీంస్, చాక్లేట్స్, బాటిల్డ్ స్మూతీస్, జామ్ వంటివి తగ్గించి తీసుకుంటే ఈ సమస్యకి చెక్ పెట్టవచ్చు.