ఒక బౌల్ లో హెన్నా పౌడర్, కుంకుడుకాయల పొడి కలిపి మిశ్రమంగా చేయాలి. దీనిలో పెరుగు కూడా వేసి బాగా కలపాలి. ఈ ప్యాక్ తలకు అప్లై చేసి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ వారానికోసారి అప్లై చేసుకోవడం ద్వారా చుండ్రు తగ్గిపోతుంది. ఈ ప్యాక్‌లో ఉపయోగించిన కుంకుడు కాయలు.. మాడును మొత్తం శుభ్రం చేసి చుండ్రు రావడానికి కారణమైన ఫంగస్‌ను నాశనం చేస్తుంది.