నాలుగైదు లికోరిస్ వేర్లని నీటిలో మరగబెట్టండి. నీరు చల్లారిన తరువాత ఒక స్ప్రే బాటిల్ లో పోయండి. రోజుకి రెండు సార్లు మిస్ట్ లా అప్లై చేయండి. ఈ నీటిని ఫ్రిజ్ లో స్టోర్ చేసి, ఎనిమిది నుండి పది రోజుల లోపు వాడేయండి.పాలలో దూది ముంచి అవసరమైన చోట రాయండి. ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజుకి రెండు సార్లు చేయవచ్చు.ఒక టమాటా ని సగానికి కట్ చేసి ఆ ముక్కతో పిగ్మెంటేషన్ ఉన్న ప్రదేశంలో రుద్దండి. ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి.