మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక గుప్పెడు కరివేపాకు వేసి వేడి చేయండి. పాన్ అడుగున నల్లగా ఏర్పడేవరకూ ఇలా చేయండి. ఇది చల్లారిన తరువాత స్కాల్ప్ నుండీ జుట్టు చివర వరకూ నెమ్మదిగా పట్టించండి. ఒక గంట తరువాత సల్ఫేట్-ఫ్రీ షాంపూ తో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయవచ్చు. కరివేపాకు జుట్టు కుదుళ్ళలో ఉండే మెలనిన్ని రిస్టోర్ చేస్తుంది. దీని వల్ల జుట్టు బాగా పెరుగుతుంది.