ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ గంధం, రెండు, మూడు కుంకుమ పువ్వు రేకులు, రెండు టీ స్పూన్ల పాలను తీసుకోండి. అన్నిటిని కలిపి మిశ్రమంగా చేసి ముఖం, మెడ భాగాలలో రాయండి. దీనిని అప్లై చేసేటప్పుడు సున్నితంగా మసాజ్ చేయండి. ముఖంపై మాస్క్ ఆరిన తర్వాత, మీ ముఖాన్ని కడిగండి. మంచి రిజల్ట్ కోసం వారంలో కనీసం రెండుసార్లు ఈ ప్యాక్ వాడండి.పాలు మీ చర్మానికి తక్షణ మెరుపుని అందిస్తుంది.