ఐబ్రోస్ రూట్స్ కి క్యాస్టర్ ఆయిల్ ను ప్రతిరోజూ అప్లై చేస్తే ఫలితం ఉంటుంది. హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది. దాంతో, ఐబ్రోస్ థిక్ గా అలాగే స్ట్రాంగ్ గా మారతాయి. కొన్నిచుక్కల క్యాస్టర్ ఆయిల్ ను తీసుకుని ఐబ్రోస్ పై ఫింగర్ టిప్స్ తో మసాజ్ చేయాలి. ముప్పై నిమిషాలపాటు అలాగే ఉండనివ్వాలి. ఆ తరువాత మేకప్ రిమూవర్ తో తుడిచేయాలి. వెచ్చటినీళ్లతో ఫేస్ ను వాష్ చేసుకోవాలి. ఐతే, క్యాస్టర్ ఆయిల్ ను వాడేముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.