చలికి చర్మం పగలకుండా ఈ బాడీ లోషన్ తయారు చేసుకోండి... ఒక   ప్యాన్ తీసుకుని అందులో షియా బటర్ వేసి లో హీట్ మీద ఈ బటర్ ని కరిగించండి. తరువాత, వేడి చేయబడిన బటర్ కి కొబ్బరి నూనె, బాదం నూనె కలపండి. బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద నుండి దింపేసి చల్లారనివ్వండి.ఇప్పుడు ల్యావెండర్, లేదా మీకు నచ్చిన ఎస్సెన్షియల్ ఆయిల్ కలిపి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక సీసాలోకి ఈ మిశ్రమాన్ని తీసుకుని ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకోండి. మీకు అవసరమయినప్పుడల్లా వాడుకోవచ్చు.