ముఖం జిడ్డుపోయి.. శుభ్రంగా ఉండాలంటే ఇలా చేయండి. ముందుగా దూది లేదా పలుచని క్లాత్ తీసుకోండి. దాన్ని పాలల్లో ముంచి ముఖంపై మెత్తగా మర్ధనా చేయండి. ఐదు నిమిషాల పాటు మర్దానా చేసి.. గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగండి. ఇప్పుడు మీ ముఖం చాలా ఫ్రెష్‌గా పరిశుభ్రంగా ఉంటుంది. జిడ్డు అనేదే కనిపించదు. సబ్బుతో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం కంటే.. పాలతో శుభ్రం చేసుకోవడమే ఉత్తమం.