కొత్తిమీరను బాగా పేస్ట్ చేయండి. అందులో కాస్త కలబంద గుజ్జును కలపండి. ఆ పేస్టుకు ముఖానికి రాసుకోండి. 15 నుంచి 20 నిమిషాలు తర్వాత నీళ్లతో కడిగేసుకోండి. కొత్తిమీరలో ఉండే విటమిన్-A చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఫలితంగా చర్మం ముడతలు పడకుండా తాజాగా ఉంటుంది. వారంలో కనీసం రెండు, మూడు సార్లు ఈ చిట్కా పాటిస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.