ఒక టేబుల్ స్పూన్ నీరు కలిపిన నిమ్మరసం లో ఒక టీ స్పూన్ తేనె కలపండి. అవసరమైన చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేసి పదిహేను నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. అయితే, ఈ చిట్కా పాటించే ముందు పాచ్ టెస్ట్ చేసుకోండి, ఎందుకంటే నిమ్మరసం సెన్సిటివ్ స్కిన్ ని ఇరిటేట్ చేస్తుంది. అంతే కాక, ఈ చిట్కా పాటించిన తరువాత సన్ స్క్రీన్ అప్లై చేయండి.