ట్యాన్ పోగొట్టుకోవడంతో పాటు చర్మాన్ని క్లెన్సింగ్ చేసుకోవడానికి టమాటా, ఎర్రకందిపప్పు, కలబందతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ వేసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది. టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు తీసుకొని 20 నుంచి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. నానిన కందిపప్పులో చెంచా టమాటా గుజ్జు, కొద్దిగా కలబంద గుజ్జు కూడా కలిపి బ్లెండర్లో వేసి మెత్తటి గుజ్జుగా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకొని 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే ముఖంపై ఉన్న ట్యాన్ పోతుంది.