ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని, అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పుతోపాటు ఒక టేబుల్ స్పూన్ పంచదార పొడిని కలపాలి. ఇందులో ఒక అర చెక్క నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇక చివరగా ఇందులో ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ ను కలపండి. వీటన్నిటినీ బాగా మిక్స్ చేసి, పేస్టు లాగా తయారు చేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, పది నిమిషాలు ఆరనిచ్చి,చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై ఉన్న మొటిమలు, మచ్చలు,వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ను తొలగించి, చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది.