ఎండాకాలంలో సూర్యరశ్మి నుంచి శరీర చర్మాన్ని కాపాడుకోవాలంటే, సన్ స్క్రీన్ లోషన్లను తప్పకుండా వాడాలి. అయితే ఈ లోషన్లను ఎంచుకునేటప్పుడు టైటానియం డై ఆక్సైడ్ జింక్ ఆక్సైడ్, ఆక్సీ బెంజాన్, ఏవో బెంజాన్, మెక్సోరిల్ 5 X ఉండే స్క్రీన్ లోషన్ మాత్రమే వాడాలి. అంతేకాకుండా వీటిలో ఎస్పీఎఫ్ 15 శాతం నుండి 30 శాతం వరకు ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వలన సూర్యరశ్మి నుండి మన చర్మాన్ని కాపాడుకోవచ్చు.