బెల్లాన్ని ముందుగా దంచి పొడి చేసి పెట్టుకోవాలి. అయినా దంచి పొడి చేసి పెట్టుకున్న బెల్లాన్ని ఒక బౌల్లో వేయాలి. బౌల్ లో వేసిన బెల్లం మధ్యలో గుంటలాగా చేసి అందులో లవంగాలను పెట్టాలి. ఈ బౌల్ మీద మరొక బౌల్ తో కప్పి ఉంచి, స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. వేడి తగలడం వల్ల బెల్లం కొంచెం కరుగుతుంది. ఆవిరి మొత్తం బయటకు వస్తుంటుంది. ఇలా మొత్తం బెల్లం ఆవిరికి కరిగిపోతుంది. కరిగిన తరువాత ఇందులో హెన్నా పౌడర్ ను కలపాలి. ఈ మిశ్రమం చల్లారిన తరవాత గోర్ల కు అప్లై చేసుకోవచ్చు.