బొప్పాయి గుజ్జు ముఖ చర్మాన్ని పెంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. బొప్పాయి గుజ్జులో కీరదోస రసాన్ని కలుపుకోవాలి. దానికి ఒక చెంచా తేనె,ఒక చెంచా గంధపు పొడి, ఒక చెంచా ముల్తానీ మట్టిని జతచేసి అవసరాన్ని బట్టి పాలతో మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఇక ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు,పాదాలకు పట్టించి, పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకుంటే సరి. నిగనిగలాడే చర్మం చిటికెలో తయారవుతుంది.