వ్యాక్సింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.వ్యాక్సింగ్ తరువాత కనిపించే మరొక సమస్య మంట. ఆ మైనపు మిశ్రమాన్ని పట్టించి, అవాంఛిత రోమాలను ఒక్కసారిగా గట్టిగా లాగడం వల్ల ఆ ప్రదేశంలో మంట,నొప్పి కలుగుతుంది. అంతేకాకుండా చర్మం కూడా వాపుకు గురి అవుతుంది. అంతేకాకుండా వ్యాక్సింగ్ ప్రక్రియలో ఉపయోగించే ఉత్పత్తులు అపరిశుభ్రంగా ఉన్నా లేదా బ్యాక్టీరియా వంటివి సంక్రమించినవి వాడడం లేదా ఒకరికి ఉపయోగించిన ఉత్పత్తులను మరొకరికి ఉపయోగించడం ఇలాంటివి చేయడం వల్ల అంటు వ్యాధులు వచ్చే అవకాశం కూడా చాలా ఉన్నాయి.