రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల కాఫీ పొడిని తీసుకొని, అందులో 150 మిల్లీలీటర్ల నీటిని కలిపి ముదురు రంగు వచ్చేవరకు స్టవ్‌మీద బాగా మరిగించాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు జుట్టు కుదుళ్ళకు పట్టించి, 30 నిమిషాలు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేసుకోవాలి. తరచూ చేయడం వల్ల తెల్లని జుట్టు నెమ్మదిగా నలుపు రంగులోకి మారడం గమనించవచ్చు.