ఒక గిన్నెలో గుడ్డులోని తెల్లసొన మాత్రమే వేసి బాగా గిలకొట్టాలి . ఆ తరువాత ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్,ఆపిల్ సైడర్ వెనిగర్ తో పాటు షాంపూ కూడా కలిపి నాచురల్ షాంపూ గా తయారు చేసుకోవచ్చు. మీరు తలస్నానం చేసేటప్పుడు ఈ షాంపూ ని ఉపయోగించుకుంటే మంచి ఫలితం ఉంటుంది.. అయితే ఈ షాంపూ తో తలస్నానం చేసేటప్పుడు మొదట గోరువెచ్చని నీటితో తలస్నానం చేసి, ఆ తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా,సాఫ్ట్ గా, సిల్కీ గా ఉంటుంది.