ముఖ్యంగా చల్లటి పాలు తీసుకోవాలి. అందులో కొద్దిగా నిమ్మరసం కూడా కలపాలి. అలాగే పొడిచేసిన బాదం లేదా కమలా తొక్క ల పొడి లేదా ఓట్స్ తొక్కలు కూడా వేసుకోవచ్చు. వీటన్నిటినీ బాగా మిశ్రమంలా తయారు చేయాలి. దీన్ని ముఖం మీద అప్లై చేసి, పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం సహజవంతంగా కాంతిని పుంజుకోవడమే కాకుండా మెరుస్తూ, మచ్చల రహితమైన ముఖం మీ సొంతం అవుతుంది. కాబట్టి నిమ్మరసం మీ చర్మానికి ఎలాంటి హాని కలిగించదు. నిరభ్యంతరంగా నిమ్మరసంను మీరు వాడే ఫేస్ ప్యాక్ లలో, ఫేస్ స్క్రబ్ లలో ఉపయోగించుకోవచ్చు.