విషపూరితం కలిగిన రంగుల్ని ఎంచుకోవడం పూర్తిగా మానేయాలి. సహజసిద్ధంగా ఏర్పడిన రంగులను మాత్రమే హోలీ ఉత్సవాల్లో ఎంచుకోవడం ఉత్తమం.. హోలీ ఆడిన తర్వాత వీలైనంత త్వరగా మీ చర్మానికి, జుట్టుకి అంటుకున్న రంగులను త్వరగా శుభ్రం చేసుకోండి.. రంగులు తడిగా ఉన్నప్పుడే కడిగితే మంచిది. ఒకవేళ పొడి రంగులు చర్మానికి అంటుకొని వదలకపోతే, ఆలివ్ ఆయిల్ లో కొద్దిగా నిమ్మరసం కలిపి, రంగు ఉన్న ప్రదేశంలో మర్దనా చేసి, ఒక గంట సేపు ఆగాలి. ఆ తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది. ఇక చర్మానికి సబ్బులు, జుట్టుకి మంచి షాంపూలు ఉపయోగించి, రంగు అంటుకున్న ప్రదేశంలో రుద్దడం వల్ల రంగులను వదిలించుకోవచ్చు. ఆ తర్వాత చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ ను ఉపయోగించాలి... ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే హోలీని ఎంతో సంబరంగా జరుపుకోవచ్చు..