నిజానికి ఈ పులిపిర్లు ఎలా ఏర్పడతాయి అంటే, ఇందుకు కారణం హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ వల్ల ఈ పులిపిర్లు ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా ముక్కు,గడ్డం,మెడ, చేతి వేళ్ళ పైన వస్తూ ఉంటాయి. అయితే ఇవి ఎలాంటి నొప్పిని కలిగించవు. కానీ కొంత మందిలో ఇవి దురద పెడుతూ ఉంటాయి. వీటిని తొలగించాలంటే ఆపిల్ సైడర్ వెనిగర్, కలబంద, బేకింగ్ పౌడర్ మంచిగా పని చేస్తాయి.