ముల్తానీ మట్టి - ఒక కప్పు, బార్లీ పొడి - ఒక కప్పు, బియ్యం పిండి - ఒక కప్పు, పెసరపిండి - ఒక కప్పు, ఎండబెట్టిన గులాబీరేకులు - ఒక కప్పు, శనగపప్పు - ఒక కప్పు,పసుపు - 3 టేబుల్ స్పూన్లు.. ఇవన్నీ ఒక్కొక్కటి చొప్పున మిక్సీలో వేసి మెత్తటి పౌడర్ లాగా చేసుకుని ఒక గ్లాస్ జార్లో భద్రపరుచుకోవచ్చు. ప్రతిరోజు దీనిని స్నానం చేసేటప్పుడు ముఖానికి, శరీరానికి ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అంతే కాకుండా ముఖం మీద ఏర్పడిన నల్లటి మచ్చలు, ముడతలు, మొటిమలు, మొటిమల కారణంగా వచ్చే మచ్చలు కూడా తొలిగిపోతాయి