చర్మము అందంగా, కాంతివంతంగా కనిపించాలంటే ఫేస్ ప్యాక్ కు సంబంధించిన మాయిశ్చరైజర్ ,క్రీములను ఉపయోగించడమే కాకుండా తాజా పండ్లు, కూరగాయలు అలాగే శరీరానికి అవసరమైన నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి వారైనా ఈ పద్ధతులను పాటించవలసిన అవసరం ఉంది . మీకు ఎటువంటి చర్మ సంబంధిత సమస్యలు ఉన్నా మీ చర్మంపై ఎటువంటి పరీక్షలు చేయకుండానే ముందుగా డాక్టర్ లను సంప్రదించాల్సి ఉంటుంది. ఇలా సంప్రదించడం వల్ల భవిష్యత్తులో అలర్జీలు, చర్మ సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.