రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి లో,ఒక టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ ల గుడ్డులోని తెల్ల సొన, అలాగే రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్ తీసుకుని ఒక కప్పులో మిశ్రమంలా తయారు చేయాలి. దీన్ని ముఖానికి ప్యాక్ లాగ వేసుకొని 15 నిమిషాలు ఆగిన తర్వాత, శుభ్రమైన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా తరచూ చేస్తుండడం వల్ల ముఖం నునుపుగా మారుతుంది. ఇలా చేయడం వల్ల ముఖము కోల్పోయిన తేమను తిరిగి అందుకుంటుంది. పొడిబారిన చర్మ తత్వానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.