చర్మ సమస్యలను తొలగించుకోవాలంటే ముఖ్యంగా తాజా ఆకుపచ్చ కాయగూరలు, పసుపు, దాల్చినచెక్క, సాల్మన్ ఫిష్, శుద్ధమైన తేనె లాంటి పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇక సున్నితమైన ఆహారం, త్వరగా జీర్ణమయ్యే ఆహారం, ఆరోగ్యకరమైన సూక్ష్మజీవులు ఉండే పోషక ఆహారాన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఇక మీ రెగ్యులర్ డైట్ లో గ్లూటెన్ చక్కెర వంటివి తొలగించండి. ఇలా చేస్తే పదహైదు రోజుల్లోనే ఫలితం కనబడుతుందని నిపుణులు పేర్కొన్నారు. ఇక ఒమేగా త్రి,విటమిన్ డి, విటమిన్ ఇ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. ఇక అలాగే ప్రతి రోజుకు అవసరమైన నిద్ర కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఒత్తిడి తగ్గించుకొని రోజు వ్యాయామం, యోగ లాంటివి చేయాలి.