పొడి చర్మం కలవారు కొద్దిగా నిమ్మరసాన్ని ఉడికించి గ్రైండ్ చేసుకున్న క్యాబేజీలో వేసి, టీ స్పూన్ తేనె కూడా వేసి, బాగా పేస్టు లాగా తయారు చేయాలి. దీనిని ముఖానికి, మెడకు అప్లై చేసి, పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇక ఈ పద్ధతిని కనుక డ్రై స్కిన్ ఉన్నవారు అనుసరిస్తే తప్పకుండా మంచి లాభాలను పొందవచ్చు.. ఇక జిడ్డు చర్మం కలవారు రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, అలాగే మూడు టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జును తీసుకోండి. ఇప్పుడు బొప్పాయి గుజ్జులో కొద్దిగా పసుపు, నిమ్మరసం వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసి, 20 నిమిషాల పాటు ఉంచి కడిగేయండి. దీని వల్ల ఆయిల్ స్కిన్ వాళ్లు సూపర్ బెనిఫిట్స్ ను పొందవచ్చు..