రెండు టేబుల్ స్పూన్ల బీన్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ పసుపు పొడి, మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల పాలు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం చివరగా ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె..ముఖం మీద ఈ పేస్ట్ ను మందపాటి పొరలాగ అప్లై చేయాలి. అంతే కాకుండా ముఖం మీద ఎక్కడైతే అవాంఛితరోమాలు ఉన్నాయో, ఆ ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. ఒక 10 నిమిషాలు ఆరనిచ్చి, మెత్తగా మునివేళ్ళతో, సుతిమెత్తగా వృత్తాకారంలో మసాజ్ చేయాలి. ఆ తర్వాత పది నిమిషాలు వదిలేసి, ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.. ఇక ఇలా తరచూ చేస్తుండడం వల్ల అతి తక్కువ సమయంలోనే అవాంఛితరోమాలు రాలిపోవడం గమనించవచ్చు..