కొబ్బరి నూనె - అర కప్పు, కరివేపాకు - 10 నుంచి 15 రెబ్బలు, మెంతులు - వన్ టేబుల్ స్పూన్, ఉల్లిపాయ -1 సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఈ పదార్థాలన్నీ ఒక బాణలిలో వేసి, మీడియం మంట పైన బాగా మరిగించాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని కిందకు దింపి చల్లార్చాలి. ఇక ఈ మిశ్రమాన్ని వడకట్టి, ఒక ఎయిర్ టైట్ గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. స్టోర్ చేసినప్పటి నుంచి రెండు మూడు రోజులు లోపు ఈ నూనెను ఎప్పుడైనా తలకు పట్టించుకోవచ్చు.ఇలా ఈ నూనెను పట్టించుకోవడం వల్ల జుట్టు రాలే నుండి అధిగమించవచ్చు. అలాగే జుట్టు ఒత్తుగా, కురులు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి..